![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు '. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -27 లో.. సిరి కోసం ధన వాళ్ళింటికి వస్తాడు. అది చూసిన శ్రీవల్లి బయట నుండి గడియపెట్టి తన భర్త, అత్తలని తీసుకొని రావడానికి బయలుదేర్తుంది. ఆ తర్వాత ఇప్పుడే మన ప్రేమ విషయం మా అన్నయ్యకి చెప్పి ఒప్పిద్దామని సిరి ధనని తీసుకొని డోర్ తీస్తుంటుంది. డోర్ రావడం లేదు ఎవరో బయట నేను వచ్చిన విషయం తెలిసి ఇలా చేశారని ధన భయపడుతుంటాడు.
ఆ తర్వాత అప్పుడే శ్రీవల్లి.. శ్రీలత సందీప్ లని తీసుకొని వస్తుంది. సిరి డోర్ తియ్ అనగానే లోపల ధన, సిరి లు భయపడుతుంటారు. ధన లోపల దాక్కొనే ఉంటాడు. సిరి వెళ్ళి డోర్ తీస్తుంది. లోపల ఎవరు ఉన్నరని రూమ్ మొత్తం సందీప్ శ్రీలత ఇద్దరు వెతుకుతుంటారు. ఎవరు కన్పించరు. అక్కడ ధన ఇచ్చిన గిఫ్ట్ చూసి ఎవరిచ్చారని శ్రీలత అడుగుతుంది. నా ఫ్రెండ్ ఇచ్చిందని సిరి చేప్తుంది అయిన శ్రీలతకి డౌట్ వస్తుంది. కేక్ కటింగ్ కి టైం అవుతుందని సిరి అందరిని బయటకు తీసుకొని వెళ్లే ప్రయత్నం చేస్తుంది కానీ శ్రీలతకి ధన కర్టెన్ వెనకలా కన్పిస్తాడు. ధనని చూసి సందీప్ కొడతాడు. ధన మొహానికి మాస్క్ పెట్టుకొని పారిపోతుంటాడు. అతని వెనకాలే సందీప్ పరిగెడుతుంటాడు. ధన పరిగెడుతుంటే రామలక్ష్మి పట్టుకొని మాస్క్ తీస్తుంది. అతనెవరో కాదు ధన.. నా తమ్ముడేనా అని చూసి రామలక్ష్మి షాక్ అవుతుంది. ధన వెంటనే మళ్ళీ పరిగెడుతుంటాడు. ఆ తర్వాత శ్రీలత, సందీప్ ఇద్దరు సిరికి గట్టిగా క్లాస్ తీసుకుంటారు. ఏమైంది మేమ్ చూపిస్తన్న ప్రేమ సరిపోవడం లేదా.. ప్రేమ దోమ అంటు తిరుగుతూ ఏకంగా ఇంటికి రమ్మని చెప్పావని శ్రీలత తిడుతుంది. ఆ తర్వాత సిరి సీతాకాంత్ దగ్గరకి వెళ్లి నీకు ఈ విషయం చెప్పకుండా దాచినందుకు క్షమించు అని అడుగుతుంది. కానీ సీతాకాంత్ ఎమోషనల్ గా మాట్లాడి వెళ్లిపోతాడు.
ఆ తర్వాత రామలక్ష్మి ఇంటికి వెళ్లి జరిగిన సంఘటన గుర్తుకు చేసుకొని బాధపడుతుంది. ఈ ప్రాబ్లమ్ నుండి ధనని ఎలా బయటకు తీసుకొని రావాలని ఆలోచిస్తుంటుంది. ధన కోసం వెయిట్ చేస్తుంటుంది. మరొకవైపు ఆ ధనని రప్పించి మధ్యలోనే వాడి పని చెయ్యాలని సందీప్ కి శ్రీలత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |